తెలంగాణలో ప్రారంభమైన పర్యాటకం.. హుస్సేన్ సాగర్‌లో మొదలైన బోటింగ్
- తెలంగాణ వ్యాప్తంగా తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు
- నేటి నుంచి నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణం ప్రారంభం
- దుర్గం చెరువు, జలాశయాల వద్ద బోటింగ్ త్వరలో ప్రారంభం
ఇక, పర్యాటక ప్రదేశాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలను తిరిగి తెరుస్తామని, దుర్గం చెరువుతోపాటు పర్యాటక జలాశయాల వద్ద బోటింగ్‌ను ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేటి నుంచి నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి.