Swaroopanandedra: అర్చకులు, వేద పండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయి: స్వరూపానందేంద్ర

Few endowments officers are careless says  Swaroopanandendra
  • కొందరు దేవాదాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
  • బ్రాహ్మణుల కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలి
  • వచ్చే ఏడాది విశాఖలో భారీ సదస్సును ఏర్పాటు చేస్తాం
దేవాదాయశాఖలోని కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విశాఖ స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. వీరి వల్ల అర్చకులు, వేద పండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ... అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యమవుతోందని చెప్పారు.

బ్రాహ్మణుల కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలని స్వరూపానందేంద్ర అన్నారు. పురోహితులకు ఏమైనా జరిగితే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనే విషయంలో తమ శారదాపీఠం ఆలోచిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది అర్చకులు, వేద పండితులు, పురోహితులతో విశాఖలో భారీ సదస్సును ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నిర్వహించిన 'బ్రహ్మజ్ఞాన స్మార్త సభ'కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.
Swaroopanandedra
Vizag
Purohit
Archakas

More Telugu News