Raghu Rama Krishna Raju: స్నేహంగా ఉన్న కేసీఆర్ నుంచి మీరు ఎందుకు నేర్చుకోవడం లేదు?: జగన్ కు రఘురామకృష్ణరాజు ప్రశ్న

Raghu Rama Krishna Rajus question to Jagan
  • ఎక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రం ఏపీనే
  • అభివృద్ధి మాత్రం ఏమీ లేదు
  • ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం
ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నన్ని అప్పులు మన దేశంలో మరే రాష్ట్రం తీసుకోలేదని... ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అప్పులు తీసుకుంటోందని... అయితే అభివృద్ధిలో ఆ రాష్ట్రం పురోగతి సాధిస్తోందని అన్నారు. మన రాష్ట్రానికి అప్పులు మాత్రమే పెరుగుతున్నాయని... అభివృద్ది మాత్రం లేదని విమర్శించారు. రోడ్లు దెబ్బతిని రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

మీతో స్నేహంగా మెలుగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ ధార్మిక సంస్థల నుంచి వచ్చే డబ్బుతో నడిచే ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ గా నియమించవద్దని కోరారు. అమరావతిపై ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
KCR
TRS

More Telugu News