Natti Kumar: టాలీవుడ్ లో మరో గొడవ.. పోలీస్ స్టేషన్ కు చేరిన ఇద్దరు నిర్మాతల వివాదం!

Tollywood producer Chanti Addala files complaint on another producer Natti Kumar
  • నట్టి కుమార్ పై ఫిర్యాదు చేసిన చంటి అడ్డాల
  • తన సినిమాను కొంటానని డబ్బులు ఇవ్వలేదన్న చంటి
  • అతని సినిమాగా చెప్పుకుంటున్నాడని మండిపాటు
ఇద్దరు నిర్మాతల మధ్య గొడవ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. నిర్మాత నట్టి కుమార్ పై మరో నిర్మాత చంటి అడ్డాల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 'ఐనా ఇష్టం నువ్వు' సినిమాను తాను కొంటానని చెప్పి, ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదని తన ఫిర్యాదులో చంటి పేర్కొన్నారు. చెక్కులు ఇచ్చి, ఇప్పుడే ప్రొసీడ్ అవ్వొద్దని చెప్పాడని తెలిపారు.

ఈ విషయంపై ఫిల్మ్  ఛాంబర్ లో ఫిర్యాదు చేస్తే... తమ మధ్య అగ్రిమెంటును ఫిల్మ్ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని... అయినా, తన పేరు తీసేసి అతని పేరు పెట్టుకున్నాడని చెప్పారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినా తన సినిమాను అతని సినిమాగా చెప్పుకుంటున్నాడని తెలిపారు. నట్టికుమార్ వంటి ఫ్రాడ్ ను నమ్మడం తన తప్పని... పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Natti Kumar
Chanti Addala
Tollywood
Police Case

More Telugu News