Delhi capitals: ఓడిన ఢిల్లీకి మరో షాక్.. శ్రేయాస్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా

Shreyas Iyer fined for slow over rate against SRH
  • హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమి
  • స్లో ఓవర్ రేట్‌ కారణంగా కెప్టెన్‌కు జరిమానా
  • ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి జట్టుగా ఢిల్లీ
ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి జట్టు ఢిల్లీనే.  

హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది.
Delhi capitals
sun risers hydrabad
IPL 2020
Shreyas Iyer
fine

More Telugu News