Bill Gates: పేద దేశాలకు 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ సరఫరా: సీరమ్ ఇనిస్టిట్యూట్

Another 10 Crore Doses of Vaccine to Poor Countries
  • డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ సరఫరా 
  • వచ్చే సంవత్సరం తొలి ఆరునెలల్లోనే పంపిణీ
  • అదనంగా రూ. 1,125 కోట్లు అందించనున్న గేట్స్ ఫౌండేషన్
పేద దేశాలకు, తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు 10 కోట్ల డోస్ ల కరోనా వ్యాక్సిన్ ను అందించేందుకు డీల్ కుదుర్చుకున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం అవుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా తెలిపారు.

2021 తొలి ఆరు నెలల్లోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ తో రూ.1,125 కోట్లతో 10 కోట్ల డోస్ ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ ఫౌండేషన్ అదనంగా మరో రూ. 1,125 కోట్లను అందించనుందని ఆయన అన్నారు. ఆ నిధులతో మరో 10 కోట్ల డోస్ లను అందిస్తామని తెలిపారు.
Bill Gates
Serum Institute
Corona Virus
Vaccine

More Telugu News