Vijayasai Reddy: పురందేశ్వరి తన పుత్ర సమానుడైన లోకేశ్ తో పోటీపడుతూ వారి స్క్రిప్టే చదువుతున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy once again comments on Purandeswari
  • ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలన్న పురందేశ్వరి
  • జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో స్పష్టమైందన్న విజయసాయి
  • ఆమెకు అభినందనలు అంటూ మరో ట్వీట్
ఏపీ రాజధానిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ఈ ఉదయం నుంచి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. రైతులకు న్యాయం జరగాలని అన్నారు. దాంతో విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో స్పష్టమైందని విమర్శించారు.

ఈ క్రమంలో మరోసారి ట్విట్టర్ వేదికగా విజయసాయి స్పందించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి గారు తనకన్నా ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన పుత్రసమానుడు లోకేశ్ తో పోటీపడి వారి స్క్రిప్టే మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందుకు ఆమెకు అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
Daggubati Purandeswari
Nara Lokesh
Amaravati
AP Capital

More Telugu News