Daggubati Purandeswari: పురందేశ్వరిపై విజయసాయి వ్యాఖ్యలు.. కులంపేరుతో దాడి చేస్తారా? అంటూ దేవధర్ మండిపాటు!

Vijayasai criticises Purandeshwari as caste leader
  • పురందేశ్వరిని జాతి నాయకురాలు అన్న విజయసాయి
  • కులం పేరుతో విమర్శిస్తారా? అని మండిపడ్డ దేవధర్
  • వైసీపీ అన్నింటినీ కులమయం చేసిందని వ్యాఖ్య

బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పురందేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది' అని విమర్శించారు.

అయితే, విజయసాయి వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ తప్పుపట్టారు. బీజేపీ పార్టీ కుల, మతాలకు అతీతంగా పని చేస్తుందని ఆయన అన్నారు. మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అర్హతను చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అని అడిగారు. అన్నింటినీ కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది విజయసాయిగారూ అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News