sajjala ramakrishna reddy: చంద్రబాబు గారూ.. గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి: సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala fires on chandrababu
  • చంద్రబాబు గారూ కృష్ణానదికి వరద వస్తోంది
  • ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించాలి
  • వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చట్టాన్ని గౌరవించాలని, ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

'తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు గారు, ఆయన కుమారుడు, వారి అనుయాయులు ఇలా వీరంతా అధికారాన్ని అనుభవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బీసీలు మోయాలంటారు. దీనికి ఏదో బ్రహ్మాండం జరుగుతున్నట్టుగా ఎల్లో పత్రికలు కలరింగ్‌ ఇస్తాయి. పాతికేళ్లుగా వేస్తున్న రికార్డే ఇది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

'చంద్రబాబు గారూ కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి. కోర్టుల ద్వారా రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?' అని ఆయన ప్రశ్నించారు.
sajjala ramakrishna reddy
YSRCP
Telugudesam

More Telugu News