Bollywood: బాలీవుడ్ డ్రగ్స్ కేసు: నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌కు అక్టోబరు 3 వరకు కస్టడీ

Kshitij Prasad in NCB custody till October 3
  • విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పని ప్రసాద్
  • 9 రోజుల కస్టడీ కోరిన ఎన్‌సీబీ
  • తనను ఇరికించారన్న క్షితిజ్ ప్రసాద్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత క్షితిజ్ ప్రసాద్ ను కోర్టు కస్టడీకి ఇచ్చింది. ప్రసాద్‌ను శనివారం (26న) అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టింది.

అతడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, కాబట్టి 9 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరగా, న్యాయస్థానం ఆరు రోజులు అంటే అక్టోబరు 3 వరకు అనుమతి నిచ్చింది. సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న నిందితులతో ప్రసాద్‌కు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్టు ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ప్రసాద్ కొట్టిపడేశారు. తనను ఇరికించారని ఆరోపించారు. క్షితిజ్ ప్రసాద్ ఇంటి నుంచి అధికారులు కొంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయడానికి ముందు ప్రసాద్‌ను విచారించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రసాద్ తప్పించుకోవడంతో అతడి కస్టడీ ఎన్‌సీబీకి అవసరమైంది.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అంకుష్ అర్నేజాతో ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రసాద్ నుంచి స్టేట్‌మెంట్ కోసం అధికారులు ఆయనను బ్లాక్ మెయిల్ చేశారని, ధర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురిచేశారని ఆయన తరపు న్యాయవాది సతీశ్ మనేషిండే కోర్టుకు తెలిపారు.
Bollywood
Drugs case
Kshitij prasad
NCB

More Telugu News