Chiranjeevi: మన జీవితాలకు వెలుగునిచ్చేది కుమార్తెలే: చిరంజీవి

Chiranjeevi responds on the occasion of world daughters day
  • నేడు వరల్డ్ డాటర్స్ డే
  • తన ఇద్దరు కుమార్తెల ఫొటో పంచుకున్న చిరంజీవి
  • కుమార్తెలు తీసుకువచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేమని వెల్లడి
ఇవాళ వరల్డ్ డాటర్స్ డే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సందేశం అందించారు. మన జీవితాలకు వెలుగు కుమార్తెలేనని పేర్కొన్నారు. వారు మన జీవితాల్లో కలిగించే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని తెలిపారు. అందరు కుమార్తెలకు హ్యాపీ వరల్డ్ డాటర్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా డాటర్స్ డే విషెస్ తెలియజేశారు. అన్షులా, జాన్వి, ఖుషీ... ఈ ముగ్గురు దేవతలు నా జీవితంలో సంతోషం, సంపదను కలిగించారు. వీరు నా కూతుళ్లు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను అంటూ ట్విట్టర్ లో స్పందించారు. రవితేజ, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ కుమార్తెలతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.
Chiranjeevi
World Daughters Day
Susmitha
Sreeja
Tollywood

More Telugu News