Chandrababu: పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించిన చంద్రబాబు

  • టీడీపీకి కొత్తరూపు
  • రెండు నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్త
  • పాతవారిని తప్పించిన చంద్రబాబు
Chnadrababu announces new in charges for parliament constituencies

గత ఎన్నికల్లో నిరాశాజనకమైన ఫలితాలు చవిచూసిన టీడీపీని మళ్లీ బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నడుంబిగించారు. టీడీపీకి కొత్తరూపు కల్పించేందుకు కసరత్తులు షురూ చేశారు. ఈ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించారు. పాతవారిని తప్పించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు ప్రకటన చేశారు. ఇన్చార్జిలను మాత్రమే కాదు, ప్రతి రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక సమన్వయకర్తను కూడా నియమించారు.

పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే...

  • అనంతపురం-కాలువ శ్రీనివాసులు
  • అమలాపురం-రెడ్డి అనంతకుమారి
  • కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  • కడప-మల్లెల లింగారెడ్డి
  • నంద్యాల-గౌరు వెంకటరెడ్డి
  • రాజంపేట-రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి
  • హిందూపురం-బీకే పార్థసారథి
  • తిరుపతి-నరసింహ యాదవ్
  • చిత్తూరు-పులివర్తి నాని
  • నెల్లూరు-అబ్దుల్ అజీజ్
  • ఒంగోలు-నూకసాని బాలాజి
  • గుంటూరు-శ్రావణ్ కుమార్
  • బాపట్ల-ఏలూరి సాంబశివరావు
  • నరసరావుపేట-జీవీ ఆంజనేయులు
  • విజయవాడ-నెట్టెం రఘురాం
  • మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ
  • నరసాపురం-తోట సీతారామలక్ష్మి
  • ఏలూరు-గన్ని వీరాంజనేయులు
  • రాజమండ్రి-జవహర్
  • కాకినాడ-జ్యోతుల నవీన్
  • విశాఖపట్నం-పల్లా శ్రీనివాసరావు
  • అరకు-గుమ్మిడి సంధ్యారాణి
  • శ్రీకాకుళం-కూన రవికుమార్
  • విజయనగరం-కిమిడి నాగార్జున
  • అనకాపల్లి-నాగ జగదీశ్వరరావు

More Telugu News