ఎల్లుండి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రోజు 7 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 5,600 మంది కరోనా కారణంగా చనిపోయారు.


More Telugu News