Arjun: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 'భారతరత్న' ఇవ్వాలి: సీనియర్ హీరో అర్జున్

Senior hero Arjun demands Bharataratna for SP Balasubrahmanyam
  • తామరైపాక్కం ఫాంహౌస్ లో ఎస్పీ బాలు అంత్యక్రియలు
  • హాజరైన సీనియర్ హీరో అర్జున్
  • అన్ని చిత్ర పరిశ్రమలు కలిసిరావాలని అర్జున్ విజ్ఞప్తి
తరానికి ఒక్కసారి మాత్రమే మహానుభావులు పుడుతుంటారు! అలాంటి ఘనతర సంగీత కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకంపై చెరగని ముద్రను వేసి మహాభినిష్క్రమణం చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు చెన్నై తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని ఫాంహౌస్ లో పూర్తయ్యాయి. బాలు అంతిమ సంస్కార కార్యక్రమానికి సీనియర్ హీరో అర్జున్ కూడా వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని కోరారు. అయితే, ఆయనకు 'భారతరత్న' కోసం తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమలన్నీ కలిసి రావాలని అన్నారు. ఒక్కడు 45 వేల పాటలు పాడడం అంటే సాధారణ విషయం కాదని, రెండు జన్మలు ఎత్తినా అన్ని పాటలు పాడడం ఇక అసాధ్యమని తెలిపారు.

ఆగస్టు 5వ తేదీ నుంచి కరోనా చికిత్స పొందిన ఎస్పీ బాలు, చివరికి కరోనాను జయించినా, ఆ మహమ్మారి కలిగించిన దుష్ఫలితాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. కరోనా నెగెటివ్ వచ్చినా, ఊపిరితిత్తులకు ఆ వైరస్ మహమ్మారి చేసిన డ్యామేజి నుంచి కోలుకోలేకపోయారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Arjun
SP Balasubrahmanyam
Bharataratna
Tollywood
Kollywood

More Telugu News