Disha: ఉత్కంఠభరితంగా దిశ ఎన్‌కౌంటర్‌ ట్రైలర్‌.. విడుదల చేసిన వర్మ

Here is the trailer of DISHA ENCOUNTER
  • గత ఏడాది దిశ హత్యాచారం
  • దిశ ఘటన ఆధారంగా వర్మ సినిమా
  • నవంబర్‌ 26న సినిమా విడుదల
గత ఏడాది సంచలనం రేపిన‌ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైన ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి ట్రైలర్ విడుదలైంది. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.

ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 'దిశ' ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు.  

      
Disha
RGV
Tollywood

More Telugu News