Bravery award: కాంబోడియాలో ఎలుకకు అరుదైన గౌరవం.. పీడీఎస్ఏ యానిమల్ బ్రేవరీ అవార్డు కైవసం!

Rat That Sniffs Out Land Mines Receives Award for Bravery
  • ల్యాండ్‌మైన్లను కనుగొనడంలో శిక్షణ
  • ఏడేళ్ల కాలంలో 39 ల్యాండ్‌మైన్లు, 28 పేలుడు పదార్థాలను గుర్తించిన ‘మగావా’
  • ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఎలుకగా గుర్తింపు
కాంబోడియాలోని ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడి భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్లను కనిపెట్టడంలో సహకరించినందుకు గాను ‘మగావా’ అనే ఆఫ్రికన్ ఎలుకకు బ్రిటిష్ చారిటీ అందజేసే ‘పీడీఎస్ఏ’ యానిమల్ బ్రేవరీ అవార్డు దక్కింది.

జంతువులకు అందించే అవార్డుల్లో ఇది అత్యంత గొప్పది కావడం గమనార్హం. ఏడేళ్ల కాలంలో ఏకంగా 39 ల్యాండ్‌మైన్లు, 28 ఇతర పేలుడు పదార్థాలను ఈ ఎలుక కనుగొంది. ప్రాణాలను రక్షించడంలో తెగువ చూపించినందుకు గాను మగావాను బంగారు పతకంతో సత్కరించారు. పీడీఎస్ఏ గోల్డ్ మెడల్ అందుకున్న మొట్టమొదటి ఎలుక మగావానే. బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్‌మైన్లను కనుగొనడంలో మగావా శిక్షణ తీసుకుంది.
Bravery award
African Rat
Magawa
Cambodia
Land mines

More Telugu News