కొవిడ్ తీవ్రంగా ఎందుకు మారుతుందంటే?: కారణాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు
- యాంటీబాడీలు తప్పుదోవ పట్టి రోగ నిరోధక వ్యవస్థపైనే దాడి
- లోప భూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు మరో కారణం
- రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
కరోనా బారినపడినప్పటికీ కొందరిలో ఆ లక్షణాలు లేకపోవడం, మరికొందరు మరణించడానికి జన్యుపరివర్తనతోపాటు తప్పుదోవపట్టిన యాంటీబాడీలే కారణమని వివరించారు. పుట్టుకతో వచ్చిన రోగనిరోధకశక్తిలో భాగమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్ ఐ ఇంటర్ ఫెరాన్’ లోపిస్తున్నట్టు చెప్పారు.
వైరస్‌లు దాడిచేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ముందే ఇవి రంగంలోకి దిగి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయన్నారు. అయితే, కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొందరి శరీరంలోని యాంటీబాడీలు ఈ ఇంటర్‌ఫెరాన్లను నాశనం చేయడమో, లేదంటే లోపభూయిష్ట జన్యు ఉత్పరివర్తనల వల్ల అవి సరిపడా ఉత్పత్తి కాకపోవడమే జరుగుతుందని, ఫలితంగా మరణాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.