చాలామంది తమిళ, కన్నడ సోదరులు బాలు తెలుగువాడంటే ఒప్పుకునేవాళ్లు కాదు: రాజమౌళి
- బాలు మరణంపై రాజమౌళి స్పందన
- బాలు మావాడేనంటూ గొడవ చేసేవాళ్లని వెల్లడి
- అందరితో మావాడు అనిపించుకున్నారంటూ ట్వీట్
చాలామంది తమిళ, కన్నడ సోదరులు ఎస్పీ బాలు తెలుగువాడంటే అంగీకరించేవాళ్లు కాదని, బాలు మావాడే అని గొడవ చేసేవాళ్లని తెలిపారు. అన్ని భాషల్లోనూ పాడి, అందరితోనూ 'మావాడు' అనిపించుకున్న ఘనత ఒక్క బాలు గారికే సాధ్యమైందని వివరించారు.
ఆయన పాడిన పాటలు, మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయన్న రాజమౌళి... మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తిప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.