KTR: విద్యుద్దీప కాంతుల్లో దుర్గంచెరువు వంతెన సోయగాలు... ఫొటోలు పంచుకున్న కేటీఆర్

KTR shares Durgam Cheruvu cable bridge night view photos
  • నేడు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న దుర్గం చెరువు బ్రిడ్జి
  • ప్రారంభించనున్న కిషన్ రెడ్డి, కేటీఆర్, బొంతు రామ్మోహన్
  • అద్భుతమైన హైదరాబాదీలకు అంకితం అంటూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలు తీర్చే ప్రణాళికలో భాగంగా దుర్గం చెరువు వద్ద నిర్మించిన భారీ కేబుల్ బ్రిడ్జిని నేడు ప్రారంభించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వంతెనను నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఈ కేబుల్ బ్రిడ్జిని అద్భుతమైన హైదరాబాద్ ప్రజలకు అంకింతం ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ముత్యాలనగరంగా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో ఆభరణంలాంటిదీ బ్రిడ్జి అంటూ వ్యాఖ్యానించారు.

KTR
Durgam Cheruvu
Bridge
Photos
Hyderabad
Kishan Reddy
Telangana

More Telugu News