SP Balasubrahmanyam: ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులను బ్లీచింగ్ చేసిన సిబ్బంది.. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు!

Police force at SP Balu house
  • బాలు ఆరోగ్యంపై ఉత్కంఠ
  • కాసేపట్లో హెల్త్ బులెటిన్
  • గత నెల 5న ఆసుపత్రిలో చేరిన బాలు
గానగంధర్వుడుగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆయన ఉన్న ఆసుపత్రి వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మరోవైపు, బాలు నివాసం చుట్టుపక్కల ఉన్న వీధులన్నింటినీ  కార్పొరేషన్ సిబ్బంది శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. అంతేకాదు ఆయన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. జరుగుతున్న పరిణామాలు  అభిమానులను మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి. గత నెల 5న కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలు చేరారు. ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చినా... ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.
SP Balasubrahmanyam
health
Tollywood

More Telugu News