Andhra Pradesh: కరోనా బారినపడిన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

AP BJP leader Vishnu Vardhan Reddy Infected to corona virus
  • జ్వరం, జలుబుతో బాధపడుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి
  • హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన నేత
  • తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచన
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌‌లోకి వెళ్లారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై బీజేపీ ఆధ్వర్యంలో మొన్న నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమంలో తనతోపాటు పాల్గొన్న నేతలు, ఇటీవల తనను కలిసినవారు, కార్యకర్తలు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
Andhra Pradesh
BJP
Vishnu Vardhan Reddy
Corona Virus

More Telugu News