Jagan: వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డికి అనారోగ్యం.... తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సీఎం జగన్

CM Jagan arrives to Hyderabad to visit his ailing uncle Gangi Reddy
  • ఈ ఉదయం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం
  • గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో గంగిరెడ్డికి చికిత్స
  • ఆసుపత్రిలో మామను పరామర్శించిన జగన్
ఏపీ సీఎం జగన్ మామగారైన గంగిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి కొన్నిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా, ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.

కొద్దిసేపటి కిందటే ఆయన గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఉదయం సీఎం జగన్ తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో కలిసి కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Jagan
Gangi Reddy
Hyderabad
YS Bharathi
Tirupati
Tirumala

More Telugu News