Jagan: తిరుమల నుంచి మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జగన్.. సీఎంను కలిసిన రమణ దీక్షితులు!

Jagan attended Modis video conference from Tirumala
  • కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ
  • అన్నమయ్య భవన్ నుంచి కాన్ఫరెన్సులో పాల్గొన్న జగన్
  • కాన్ఫరెన్స్ తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం
ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. నుదుటున మూడు నామాలు పెట్టుకుని ఎంతో భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు తిరుమలలో ఉన్న అన్నమయ్య భవన్ లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. కరోనాకు సంబంధించి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాన్ఫరెన్సుకు ముందు ముఖ్యమంత్రిని తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు. అయితే, శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత మాట్లాడుతానని ఆయనకు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో రమణ దీక్షితులు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల అంశం ఇంకా పెండింగ్ లో ఉందని... దాని గురించి మాట్లాడేందుకు సీఎంని కలిశానని చెప్పారు.
Jagan
YSRCP
Narendra Modi
BJP
Tirumala
Ramana Deekshitulu

More Telugu News