Xi jin ping: కర్బన ఉద్గార రహిత దేశంగా మారుతాం: చైనా అధ్యక్షుడి ప్రతిజ్ఞ

Jinping Pledge by 2060 China Will be Carbon Free
  • 2030 నాటికి గరిష్ఠ స్థాయికి ఉద్గారాలు
  • ఆపై 20 ఏళ్లలో కనిష్ఠానికి
  • యూఎస్ సమావేశాల్లో జిన్ పింగ్
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశంగా ఉన్న చైనా, వాయు కాలుష్యాలను తగ్గించాలని నిర్ణయించింది. 2060 నాటికి కర్బన ఉద్గారాలు విడుదల చేయని తొలి దేశంగా చైనా మారనుందని అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. 2030 నాటికి చైనాలో కర్భన ఉద్గారాలు గరిష్ఠానికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్న వేళ, జిన్ పింగ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన జిన్ పింగ్, పారిస్ లో జరిగిన క్లయిమెట్ ఒప్పందానికి చైనా పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కరోనా నుంచి ప్రపంచం బయటపడే దిశగా పర్యావరణం కూడా ముఖ్యపాత్ర పోషించనుందని ఆయన అన్నారు. భూమిని రక్షించేందుకు ప్రతి దేశమూ చర్యలు చేపట్టాలని కోరిన ఆయన, పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

కాగా ఈ సమావేశాలు వర్చ్యువల్ విధానంలో సాగగా, చైనాలో 2030 నాటికి సీఓ2 ఉద్గారాలు గరిష్ఠానికి చేరుతామని, ఆపై మరో 30 ఏళ్లలో... అంటే, 2060లోగా కనిష్ఠానికి చేరుస్తామని జిన్ పింగ్ అన్నారు. అన్ని దేశాలూ ఈ చారిత్రాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమలను అన్నింటినీ తదుపరి తరానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
Xi jin ping
China
Carbon Emissions
UNO

More Telugu News