Chandrababu: టీడీపీ ఏపీ అధ్యక్షుడి పేరును ఖరారు చేసిన చంద్రబాబు

Chandrababu selects Acchamnaidu as AP Party chief
  • రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి పేరు ఖరారు
  • 27న అధికారికంగా ప్రకటించనున్న చంద్రబాబు
  • మళ్లీ బీసీ నేతకే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించిన అధినేత
ఏపీ టీడీపీ కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు పూర్తయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 27న అచ్చెన్న నియామకానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లడంలో అచ్చెన్న సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Chandrababu
Kinjarapu Acchamnaidu
Telugudesam
Andhra Pradesh
TDP President

More Telugu News