Chiranjeevi: నా జీవితంలో ఆగస్టు 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ఉంది: చిరంజీవి

sep 22 very special to me chiru
  • ఆగస్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు
  • సెప్టెంబరు 22 నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
  • ఈ రోజే నా తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైంది
తన జీవితంలో ఆగస్టు 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబరు 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆగస్టు 22 తాను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజని, సెప్టెంబరు 22 తాను నటుడిగా ప్రాణం పోసుకున్న రోజని చెప్పారు. ఈ రోజే తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైందని వివరించారు.

తనను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని  చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  కాగా, ప్రాణం ఖరీదు సినిమా 1978 సెప్టెంబరు 22న విడుదలైంది. తెలుగు సినీ చరిత్రలో చిరంజీవి రావడానికి ముందు, వచ్చిన తర్వాత అని చెప్పుకునేలా ఆయన ఎదిగారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
Chiranjeevi
Tollywood
Twitter

More Telugu News