India: దిగొస్తున్న బంగారం ధర... మరో రూ. 805 తగ్గుదల!

Gold Price Down Further
  • తాజాగా రూ. 805 తగ్గిన ధర
  • పది గ్రాములు రూ.50,910కి చేరిక
  • కిలో వెండి ధర రూ. 65,726కు

ఇటీవలి కాలంలో ఆటుపోట్ల మధ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, నిన్న మరింతగా తగ్గాయి. ఈ ధరలు మరింతగా పడిపోవచ్చని  భావిస్తున్న బులియన్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మరింతగా దిగివచ్చింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ధరల పతనానికి కారణమని నిపుణులు అంచనా వేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర, సోమవారం నాడు రూ. 805 తగ్గి రూ. 50,910కి చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,151 పడిపోయి, రూ. 65,726కు చేరుకుంది.

కాగా, వాస్తవానికి బంగారం ధరలు మరింతగా తగ్గి ఉండాల్సిందని, అయితే, యూరప్ దేశాల్లో పలు కఠిన నియంత్రణా నిబంధనలను ప్రకటించడం వల్ల బంగారం ధర మరింత తగ్గకుండా నిలబడిందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇదే తరహా ఒడిదుడుకుల మధ్య సాగవచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News