Chandrababu: సింగీతం శ్రీనివాసరావు గారూ... మీరు కరోనా బారినపడ్డారని విన్నాను, మీ ఆరోగ్యం జాగ్రత్త: చంద్రబాబు

Chandrababu and Lokesh wishes veteran director Singitham Srinivasa Rao on his birthday
  • సింగీతంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • నిండు నూరేళ్లు జీవించాలంటూ ట్వీట్
  • మీ చిత్రం కోసం ఎదురుచూస్తున్నానంటూ లోకేశ్ వ్యాఖ్యలు
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించారని చంద్రబాబు కొనియాడారు. ప్రతిభావంతుడైన తెలుగు సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 90వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

"శ్రీనివాసరావు గారూ... ఇటీవలే మీరు కరోనా బారినపడ్డారని విన్నారు. పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిసింది. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇటీవలే మీరు మీ మనవరాలితో కలిసి పాడిన మాయాబజార్ సినిమా నాటి పాటను విని ఆనందించాను. అదే ఉత్సాహంతో మీరు నిండు నూరేళ్లు ఉల్లాసంగా జీవించాలని కోరుకుంటున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.

నేను కూడా సింగీతం కొత్త చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను: నారా లోకేశ్

వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పక విమానం, ఆదిత్య 369, వంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసిన వెండితెర సైంటిస్ట్ అంటూ కొనియాడారు. సింగీతం 89 ఏళ్ల వయసులోనూ సరికొత్త సైన్స్ ఫిక్షన్ చిత్రానికి పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, తాను కూడా ఆయన చిత్రం కోసం అభిమానులతో కలిసి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ వయసులోనూ ఇంకా విభిన్న సినీ ప్రయోగాలు చేస్తున్న సింగీతంగారి నుంచి మనమందరం స్ఫూర్తి పొందాలని లోకేశ్ పేర్కొన్నారు.
Chandrababu
Nara Lokesh
Singitham Srinivasa Rao
Birthday
Tollywood

More Telugu News