Prabhas: ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకి దిగ్గజ దర్శకుని గైడెన్స్!

Singeetam guidens to Prabhas pan India movie
  • ప్రభాస్, దీపికలతో వైజయంతీ సినిమా 
  • సోషియో ఫాంటసీ కథతో నిర్మాణం    
  • సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ గైడెన్స్    
  • సింగీతంను ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ 
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'విచిత్ర సోదరులు', 'పుష్పక విమానం', 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి క్లాసిక్స్ అనదగ్గ పలు చిత్రాలను రూపొందించి టాలీవుడ్ చరిత్రలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారాయన. అటువంటి సింగీతం ఇప్పుడు ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ గైడెన్స్ చేయనున్నారు.

'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. పాన్ ఇండియా చిత్రంగా వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పడుకొణే కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రానికి సింగీతం క్రియేటివ్ హెడ్ తరహాలో గైడెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.  

ఈ రోజు దర్శకుడు సింగీతం జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేసింది. 'మా చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. మా ఎపిక్ లోకి సింగీతం గారిని ఆహ్వానిస్తున్నందుకు ఎంతో అనుభూతి చెందుతున్నాం. ఆయన సృజనాత్మక శక్తులు మాకు కచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాయి' అంటూ వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది.
Prabhas
Deepika Padukone
Nag Ashvin
Singeetam Srinivas Rao

More Telugu News