Air India: కరోనా కేసుల నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా విమానాలను నిషేధించిన హాంకాంగ్!

Hongkong Banned Air India
  • ఇటీవల హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు
  • కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లగా, వెంటనే పాజిటివ్
  • సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం
హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ, ఎయిర్ ఇండియాకు చెందిన ఏ విమానాన్నీ తమ దేశంలోకి అనుమతించబోనని ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఇండియా నుంచి వస్తూ, పోతూ ఉన్న ప్రయాణికుల కారణంగానే తమ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఆ కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. అక్టోబర్ 3వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని, ఎయిర్ ఇండియాతో పాటు కాథే డ్రాగన్ విమానాలపైనా ఇదే తరహా నిషేధం అమలవుతుందని హాంకాంగ్ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, సెప్టెంబర్ 18న ఇండియాకు చెందిన ఐదుగురు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లి, కరోనా పాజిటివ్ గా తేలగా, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వీరంతా తమ ప్రయాణానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించారు. ఆపై దేశంలో ల్యాండ్ అయిన తరువాత వీరికి పాజిటివ్ గా తేలింది. ఇదే సమయంలో హాంకాంగ్ లో ఒకే రోజు 23 కొత్త కరోనా కేసులు వచ్చాయి. వీరిలో మూడో వంతు మంది ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన వారేనని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Air India
Hongkong
Flights
Corona Virus

More Telugu News