పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని ఏపీ సీఎం లేఖ రాశారు: కేంద్రం
- విజయసాయి ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు
- ఏపీ సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని వెల్లడి
- ఆగస్టు 25న సీఎం జగన్ లేఖ రాశారన్న కేంద్ర మంత్రి
మొత్తం రూ,12,506 కోట్ల మేర పనులు చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని, 2014 ఏప్రిల్ నుంచి 2020 జూలై వరకు ఈ పనులు చేసినట్టు ఏపీ తెలిపిందని కేంద్రం పేర్కొంది. పోలవరం 71.46 శాతం పూర్తయిందని ఏపీ తెలిపిందని, పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని ఏపీ సీఎం లేఖ రాశారని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం జగన్ ఈ లేఖ రాశారని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు.
అయితే, పనుల పురోగతి, బిల్లుల తనిఖీ, పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసుల మేరకే నిధుల విడుదల ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.