పార్లమెంటు సమావేశాలను కుదించే యోచనలో కేంద్ర ప్రభుత్వం
- కరోనా బారిన పడుతున్న ఎంపీలు
- అంతకంతకూ పెరుగుతున్న కేసులు
- పని దినాలపై పునరాలోచనలో పడిన కేంద్రం
ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు.