Uttar Pradesh: దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మిస్తాం: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath orders land hunt for Indias biggest film city near Noida
  • గ్రేటర్ నోయిడా, నోయిడాలలో అనువైన స్థలం చూడాలని ఆదేశం
  • అందమైన, అతిపెద్ద ఫిలింసిటీ నిర్మిస్తామని ప్రకటన
  • మీరట్ మెట్రో ప్రాజెక్టును 2025 కల్లా పూర్తి చేయాలన్న సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

గౌతం బుద్ధనగర్‌ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మీరట్‌లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Uttar Pradesh
Yogi Adityanath
Film city
Greater Noida

More Telugu News