Raghu Rama Krishna Raju: పులివెందులలో 10 వేల మందితో సభ పెట్టే కెపాసిటీ నాకు ఉంది: రఘురామకృష్ణరాజు

I have capacity to conduct a rally in Pulivendula says Raghu Rama Krishna Raju
  • రాజూభయ్యా నాకు మంచి స్నేహితుడు
  • నన్ను కాపాడేవారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు
  • ఆకు రౌడీలకు భయపడే స్థితిలో లేను
తన తోలు తీస్తామంటూ వైసీపీ ఎంపీలు నిన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని... ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు. తోలు తీయడం తన వృత్తి కాదని, ప్రజలు అసహ్యించుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు.

తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని రఘురాజు చెప్పారు. ఎంపీ రాజుభయ్యా తనకు మంచి స్నేహితుడని, రాజూభయ్యానే కాదు తనను కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని తెలిపారు. రాయలసీమలో, పులివెందులలో కూడా తనకు స్నేహితులు ఉన్నారని... పది వేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకుందని చెప్పారు. కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామని అన్నారు. న్యాయ వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా తమ వైసీపీ పార్టీ పని చేస్తోందని... తనను అనర్హుడిగా ప్రకటించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్ము వారికి లేదని చెప్పారు. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Raju Bhayya
Pulivendula

More Telugu News