కరోనాతో వణుకుతున్న మహారాష్ట్ర.. మహమ్మారి బారిన 20 వేల మందికిపైగా పోలీసులు
- 20 వేల మందిలో 2 వేలమందికిపైగా అధికారులు
- ఇప్పటి వరకు 208 మంది మృతి
- నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 25 కోట్ల జరిమానా వసూలు
కరోనా బారినపడిన 20 వేల మందికిపైగా పోలీసుల్లో 2 వేల మందికిపైగా అధికారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 208 మంది పోలీసులు మృతి చెందారు. మరణించిన వారిలోనూ 21 మంది ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఇంకా 3 వేలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 16 వేల మందికిపైగా పోలీసులు కోలుకున్నారు.
ఇక, కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 2 లక్షల మందిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 34 వేల మంది అరెస్టయ్యారు. అలాగే, నిబంధనల ఉల్లంఘనుల నుంచి ఇప్పటి వరకు రూ. 25 కోట్ల జరిమానా వసూలు చేశారు.