Adimulapu Suresh: పేదల మనసెరిగి జగన్ పథకాలను రూపొందిస్తున్నారు: ఆదిమూలపు సురేశ్

Jagan designing schemes according to poor peoples desires says Adimulapu Suresh
  • కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం
  • ప్రజల అవసరాలను గుర్తెరిగి పథకాలను జగన్ రూపొందిస్తున్నారు
  • టీడీపీ హయాంలో అన్ని పథకాల్లో అవినీతి జరిగింది
తమ హయాంలో తీసుకొచ్చిన పథకాలనే పేర్లు మార్చి కొనసాగిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మారింది పేర్లు కాదని, ఆలోచనా విధానమని అన్నారు. పేద ప్రజల అవసరాలు గుర్తెరిగి ముఖ్యమంత్రి జగన్ పథకాలను రూపొందిస్తున్నారని చెప్పారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని పథకాల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని సురేశ్ చెప్పారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని కితాబిచ్చారు. గత ప్రభుత్వం గర్భవతులు, బాలింతల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే... తమ ప్రభుత్వం నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాశాయని... తమ ముఖ్యమంత్రి మాత్రం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్లాలని పట్టుదలతో ఉన్నారని తెలిపారు. అయితే ఇంగ్లీష్ మీడియంను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లిందని మండిపడ్డారు.
Adimulapu Suresh
Jagan
YSRCP
Telugudesam

More Telugu News