Babri Masjid: బాబ్రీమసీదు కేసులో 30న తుది తీర్పు.. కోర్టుకు తప్పక హాజరుకావాలని అద్వానీ, జోషీలకు కోర్టు ఆదేశం!

Court to deliver final judgement in Babri Masjid case on 30
  • 1992 నాటి బాబ్రీ కేసులో తుది తీర్పు
  • తీర్పును వెలువరించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు
  • కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
దేశ చరిత్రను రాజకీయంగా, సామాజికంగా మలుపు తిప్పిన చారిత్రాత్మక బాబ్రీ మసీదు కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తుది తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1992 నాటి మసీదు కూల్చివేత ఘటనలో వీరు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత జూలై 24న అద్వానీ స్టేట్మెంట్ ను ప్రత్యేక సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో తాను ఏ తప్పు చేయలేదని అద్వానీ చెప్పారు. మరోవైపు విచారణ తర్వాత ఉమా భారతి స్పందిస్తూ తనకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధమేనని అన్నారు. మరోవైపు కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్ర వుంది.
Babri Masjid
LK Advani
MM Joshi
BJP
CBI Court
Final Judgement

More Telugu News