Bill Gates: బిల్ గేట్స్ కు పితృవియోగం.. తన తండ్రి ఎందరినో ప్రభావితం చేశారన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

Bill Gates father dies at 94
  • బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ కన్నుమూత
  • ఆయన వయసు 94 ఏళ్లు
  • తనపై ఆయన ప్రభావం ఎంతో ఉందన్న గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి విలియమ్ గేట్స్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. కుటుంబసభ్యుల  మధ్యే ఆయన తుదిశ్వాస విడిచారని చెప్పారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని... ఈ నేపథ్యంలో జీవితంలో తప్పకుండా చోటుచేసుకునే రోజు కోసం తామంతా మానసికంగా సిద్ధమయ్యామని తెలిపారు. తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయనకున్న మేధస్సు, ఉదారత, గొప్ప భావాలతో తన తండ్రి ఎందరినో ప్రభావితం చేశారని బిల్ గేట్స్ చెప్పారు. తనపై కూడా ఆయన ప్రభావం ఎంతో ఉందని అన్నారు. అసలైన బిల్ గేట్స్ తన తండ్రేనని అన్నారు. మరోవైపు బిల్స్ గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో కూడా ఆయన తండ్రి పాత్ర ఎంతో ఉంది. విలియం గేట్స్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Bill Gates
William Gates
Microsoft

More Telugu News