సవాల్ విసురుతున్నా.... కావాలంటే బహిష్కరించి చూడండి: రఘురామకృష్ణరాజు
- మరోమారు రఘురామ ఆగ్రహం
- మిథున్ రెడ్డికి 3 ఓట్లు కూడా రావని వ్యాఖ్యలు
- అన్నీ మీ కులస్తులకేనా అంటూ విమర్శలు
తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని స్పష్టం చేశారు. సవాల్ విసురుతున్నా... కావాలంటే బహిష్కరించి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఎలాగైనా తానే కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని తెలిపారు. చట్ట ప్రకారం నాపై అనర్హత వేటు వేయడం మీ వల్ల కాదు అని పేర్కొన్నారు. ఈ కమిటీ చైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా సాధించుకున్నానని ఉద్ఘాటించారు. పదవులన్నీ మీ కులస్తులకేనా? అని ప్రశ్నించారు.