Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల తాజా లెక్కలు ఇవీ!

2058 corona cases registered in telangana yesterday
  • నిన్న 2 వేలకు పైగా కేసులు నమోదు
  • ఇప్పటి వరకు 984 మంది కరోనా కాటుకు బలి
  • యాక్టివ్‌గా 30,400 కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 2,058 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి పెరిగింది. నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 51,247 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 22,20,586కు పెరిగింది. ఇక, గత 24 గంటల్లో కరోనా కాటుకు 10 మంది బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు 984 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

నిన్న ఒక్క రోజే 2,180 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,29,187 మంది వైరస్ బారినుంచి బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంకా 30,400 కేసులు క్రియాశీలంగా ఉండగా, 23,534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

.
Telangana
Corona Virus
corona deaths
active cases

More Telugu News