Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Keerti Suresh delayed film to be released through OTT
  • పేరు మార్చుకున్న కీర్తి సురేశ్ సినిమా
  • వీడియో ఆల్బంతో వస్తున్న ప్రియా ప్రకాశ్
  • మళ్లీ వస్తున్న ఒకప్పటి నాయిక రంభ     
*  గతంలో కీర్తి సురేశ్, నవీన్ విజయ కృష్ణ జంటగా చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించుకున్న 'ఐనా.. ఇష్టం నువ్వు' చిత్రం పేరును తాజాగా 'జానకితో నేను'గా మార్చారు. మిగిలి వున్న షూటింగును కూడా త్వరలోనే పూర్తిచేసి, ఓటీటీ ద్వారా దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి నూతన దర్శకుడు రాంప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  'ఒరు ఆదార్ లవ్' సినిమాలో గమ్మత్తుగా కన్నుగీటడం ద్వారా ఎంతో పాప్యులర్ అయిన మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా సింగర్ గా మారింది. క్రిస్టస్ స్టీఫెన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఓ హిందీ వీడియో ఆల్బంలో ఆమె ఒక పాట పాడింది. త్వరలోనే ఇది రిలీజ్ అవుతుంది.
*  ఒకప్పుడు కథానాయికగా పలు చిత్రాలలో నటించి టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రంభ వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. త్వరలోనే కొన్ని భారీ ప్రాజక్టులను ఆమె అంగీకరించనుంది.
Keerti Suresh
Priya Prakash
Rambha

More Telugu News