Madhavi Latha: కంగనాకు చివరివరకు మద్దతిస్తా... మీరు కూడా!: మాధవీలత సందేశం

Tollywood actress and BJP leader Madhavi Latha supports Kangana Ranaut
  • నేను మాధవీలతను.. భరతమాత పుత్రికను అంటూ వీడియో
  • ఇవాళ కంగనాతో, రేపు మీతో అంటూ వ్యాఖ్యలు
  • జై మాతా దీ అంటూ నినాదం
శివసేన పార్టీతో ఒంటరి పోరాటం సాగిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు క్రమంగా మద్దతు లభిస్తోంది. తాజాగా టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియా వేదికగా కంగనాకు తాను మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు.

"నేను మాధవీలతను... భరతమాత పుత్రికను. అన్ని జాతి విద్రోహశక్తులకు వ్యతిరేకంగా కంగనాకు చివరి వరకు మద్దతుగా నిలుస్తాను... జై మాతా దీ!" అంటూ నినదించారు. ఇవాళ కంగనాకు మద్దతిస్తాను, రేపు మీకు అంటూ పేర్కొన్నారు. కంగనాకు న్యాయం జరగాలని, అందరూ ఆమెకు మద్దతు పలకాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు.

గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, కంగనా రనౌత్ ను శివసేన టార్గెట్ చేసిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇటీవలే కంగనా కార్యాలయాన్ని కూల్చివేసిన మహారాష్ట్ర సర్కారు, తాజాగా కంగనా నివాసం కూడా అక్రమ నిర్మాణమే అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ కంగనా బరువైన హృదయంతో ముంబయిని వీడి వెళుతున్నా అంటూ ప్రకటన చేయడం తెలిసిందే.

Madhavi Latha
Kangana Ranaut
Support
Bollywood
BJP

More Telugu News