Hyderabad: డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడిని బ్లాక్ మెయిలింగ్ తో ముంచేసిన యువతి!

Fruad in Dating App
  • తరుణ్ అనే యువకుడికి పరిచయమైన యువతి
  • బెదిరింపులకు దిగడంతో రూ. 73 వేలు చెల్లించిన వైనం
  • కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
తనకు డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ యువకుడిని మాయ చేసిన యువతిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, పద్మారావు నగర్ కు చెందిన తరుణ్ అనే యువకుడికి ఓ డేటింగ్ యాప్ లో యువతి నుంచి సందేహం వచ్చింది. ఆపై ఇద్దరి మధ్యా చాటింగ్, వీడియో కాల్స్ జోరుగానే సాగాయి.

ఈ క్రమంలో యువకుడి వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను ఆ అమ్మాయి సేకరించి పెట్టుకుంది. ఆపై బెదిరింపులకు దిగిన ఆమె, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, తన వద్ద ఉన్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరికలకు దిగింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనతో పలు దఫాలుగా రూ. 73 వేలను ఆమె చెప్పిన ఖాతాలో జమ చేశాడు. అయినా ఆమె నుంచి వేధింపులు తగ్గకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
Hyderabad
Cyber Crime
Dating App

More Telugu News