Allu Arjun: సొంతంగా డిజైన్ చేయించుకున్న మాస్క్ తో అల్లు అర్జున్... ఫొటోలకు ఎగబడిన ఫ్యాన్స్

Allu Arjun visits famous Kuntala waterfalls
  • కుంటాల జలపాతం వద్ద బన్నీ సందడి
  • ఫొటోలు తీసుకునేందుకు ఎగబడిన ఫ్యాన్స్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పిక్
లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే బయట పబ్లిక్ ప్లేసుల్లో దర్శనమిస్తున్నారు. అల్లు అర్జున్ నిన్న ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతాన్ని తన ఫ్రెండ్స్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

కుంటాల వచ్చిన బన్నీ సొంతంగా డిజైన్ చేసిన మాస్కు ధరించడం అభిమానులను ఆకర్షించింది. ఆ మాస్కుపై AA (అల్లు అర్జున్) అనే అక్షరాలు పొందుపరిచి ఉన్నాయి. తన డ్రెస్ కలర్ కు మ్యాచింగ్ మాస్కు ధరించిన బన్నీని ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. పైగా పుష్ప చిత్రం కోసం పెంచిన ఉంగరాల జుత్తు కూడా బన్నీకి అదనపు సొగసు తెచ్చిపెట్టింది. కుంటాల జలపాతం వద్దకు వచ్చిన అల్లు అర్జున్ కు అధికారులు అక్కడి ప్రాశస్త్యాన్ని వివరించారు. కుంటాల జలపాతం... రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేర్కొంది.
Allu Arjun
Kuntala
Mask
Tollywood

More Telugu News