AIIMS: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన

Delhi AIIMS issues statement after Amit Shah admitted once again
  • మళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా
  • డిశ్చార్జి సమయంలో డాక్టర్ల సలహా పాటించిన అమిత్ షా
  • పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కంప్లీట్ హెల్త్ చెకప్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా నెగెటివ్ వచ్చాక, తదనంతర చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆపై ఆరోగ్యం సంతరించుకోవడంతో ఆగస్టు 30న డిశ్చార్జి అయ్యారు. అయితే, అమిత్ షా మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

దీనిపై ఎయిమ్స్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. అమిత్ షాను ఆగస్టు 30న డిశ్చార్జి చేశామని, కానీ డిశ్చార్జి సమయంలో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారని ఈ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆయన పూర్తి హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని వివరించారు. ఆయన ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
AIIMS
Amit Shah
New Delhi
Corona Virus
Parliament

More Telugu News