drugs: 'డ్రగ్స్‌ తీసుకున్నాను' గతంలో చెప్పిన హీరోయిన్‌ కంగన.. వీడియో ఇదిగో

Main drug addict thi kangana ranaut
  • అప్పటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చానన్న కంగన
  • యుక్త వయసులో ఇబ్బందులు పడ్డానని వ్యాఖ్య
సినీ హీరోయిన్ కంగనా ర‌నౌత్ శివ‌సేన నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తుండడం, డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు విన‌ప‌డుతుండ‌డం వంటి ఘ‌ట‌న‌లతో ఆమె గురించి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి పలువురి పేర్లు చెప్పడంతో దీనిపై కూడా సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

తమ పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో తానూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డానంటూ గతంలో కంగనా రనౌత్ చెప్పిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటనలో ఆసక్తి ఉండడంతో తాను ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని,  కొన్ని సంవత్సరాల తర్వాత తాను ఓ స్టార్‌గా ఎదిగానని ఆమె చెప్పింది.

ఈ క్రమంలో డ్రగ్స్‌కి కూడా బానిసను అయ్యానని తెలిపింది. చాలా మంది చెడ్డవారి చేతుల్లో తాను ఇబ్బందులు పడ్డానని, తాను యుక్త వయసులో ఉన్న సమయంలో ఈ అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పింది. కాగా, ప్రస్తుతం డ్రగ్స్‌ తీసుకునేవారితో తనకి ఎలాంటి సంబంధాల్లేవని ఇటీవలే కంగనా రనౌత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
drugs
Kangana Ranaut
Bollywood

More Telugu News