Vijay Sai Reddy: నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా?  లోకేశ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్

vijay sai reddy mocks lokesh
  • నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా తెలియదా?
  • నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు
  • ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?
  • అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?
టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదంటూ చురకలంటించారు.

'లోకేశం..నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా? నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీ పై అని దుష్ప్రచారం చేయిస్తావా? అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా? ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా, సహజవాయువుపై  14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వల్ల ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్లు తెలిపింది.
Vijay Sai Reddy
YSRCP
Nara Lokesh

More Telugu News