US Open: తొలి సెట్లో ఘోర వైఫల్యం తరువాత... యూఎస్ ఓపెన్ ను సునాయాసంగా గెలిచిన ఒసాకా!

  • 2018లో తొలిసారి టైటిల్ గెలిచిన ఒసాకా
  • ఫైనల్ లో అజరెంకాపై విజయం
  • రెండో యూఎస్ ఓపెన్ గెలిచిన జపాన్ క్రీడాకారిణి
US Open Winner Osaka

ఏడాది వ్యవధిలో రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ ను జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన నయామీ ఒసాకా ఎగరేసుకుపోయింది. గత రాత్రి జరిగిన ఫైనల్ లో విక్టోరియా అజరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో ఒసాకా విజయం సాధించింది. తొలి సెట్లో ఘోరంగా వైఫల్యం చెందినప్పటికీ, ఏ మాత్రమూ తొణకకుండా, తనదైనా ఆటతీరుతో తదుపరి సెట్లలో చెలరేగిపోయిన ఒసాకా, సునాయాసంగా టైటిల్ ను గెలుచుకుంది.

2018లో యూఎస్ ఓపెన్ ను తొలిసారి గెలుచుకున్న ఒసాకా, ఏడాది గ్యాప్ తరువాత మరోమారు అదే టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. తొలి సెట్ ను ఓడిపోయిన తరువాత, రెండో సెట్ లో అజరెంకాకు చుక్కలు చూపించిన ఒసాకా, అదే ఊపుతో మూడవ సెట్ లోనూ తన సత్తా చాటింది. కాగా, సెమీఫైనల్ లో సెరెనా విలియమ్స్ తో జరిగిన పోరులో 1-6, 6-3, 6-3 తేడాతో గెలిచిన అజరెంకా, అదే స్కోరుతో ఫైనల్ లో ఓడిపోవడం గమనార్హం.

More Telugu News