Allu Arjun: అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ ఇక కేరళ అడవుల్లోనే!

Allu Arjuns Pushpa shoot postponed again
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ 'పుష్ప'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగుకి ప్లాన్
  • డిసెంబర్ నుంచి కేరళ అడవులలోనే షూట్  
అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' షూటింగ్ మరోసారి వాయిదాపడినట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమా సాధించిన విజయం తరవాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రమైన 'పుష్ప'ను సుకుమార్ దర్శకత్వంలో షురూ చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రం షూటింగును కేరళ అడవులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో లాక్ డౌన్ రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

ఇక పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడవని భావించి ఈ చిత్రం షూటింగును మహబూబ్ నగర్ అడవుల్లో చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నారు. తక్కువ మంది యూనిట్ సభ్యులతో .. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడ షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొదట్లో అనుకున్నట్టుగా కాస్త ఆలస్యమైనా కేరళ అడవుల్లోనే చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో డిసెంబర్ నుంచి కేరళ అడవుల్లో షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం.

అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని బాణీలను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.  
Allu Arjun
Sukumar
Rashmika Mandanna
Devisri Prasad

More Telugu News