Harish Rao: హరీశ్ రావుకు నెగెటివ్ వచ్చింది: వైద్యులు

Harish Rao tests with Corona negetive
  • ఈనెల 4న హరీశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
  • హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందిన హరీశ్
  • హరీశ్ కోలుకోవడంతో ఆనందంలో టీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ టెస్టులో హరీశ్ కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈనెల 4న హరీశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన హోం ఐసొలేషన్ కి వెళ్లి, చికిత్స తీసుకున్నారు.

తనకు కరోనా సోకినట్టు ఈనెల 5న హరీశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ, టెస్టులో పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు. తాను బాగున్నానని... తనను కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. తాజాగా హరీశ్ కోలుకున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Harish Rao
TRS
Corona Virus

More Telugu News